sensex: భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసిన యూఎస్-చైనా వాణిజ్య యుద్ధ భయాలు
  • ఒకానొక సమయంలో 365 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • చివర్లో కొంత మేర కోలుకున్న మార్కెట్లు

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో, భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 65 డాలర్లకు పైగా పెరగడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో సెన్సెక్స్ ఏకంగా 365 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లు పతనమయ్యాయి. చివర్లో మళ్లీ కోలుకోవడంతో... ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్  67 పాయింట్ల నష్టంతో 35,808 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 10,724 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా, టాటా స్టీల్, వేదాంత లిమిటెడ్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఫైనాన్స్ లు టాప్ లూజర్లుగా నిలిచాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్ టెల్ లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

More Telugu News