TTD: టీటీడీ సభ్యుడిగా సండ్ర నియామకం ఉపసంహరణ!

  • టీటీడీ సభ్యుడిగా సండ్రను నియమించి రెండు నెలలు
  • అయినప్పటికీ బాధ్యతలు స్వీకరించని సండ్ర
  • సండ్ర నియామకాన్ని ఉపసంహరిస్తూ ఏపీ నిర్ణయం
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యుడిగా ఏపీ ప్రభుత్వం ఇటీవల నియమించింది. అయితే, టీటీడీ సభ్యుడిగా నియమించి రెండు నెలలు గడుస్తున్నా ఆ బాధ్యతలను ఆయన స్వీకరించలేదు. దీంతో, టీటీడీ సభ్యుడిగా సండ్ర నియామకాన్ని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో సండ్ర ఒకరు. టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి సండ్ర వెళతారన్న ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. 
TTD
Telugudesam
Telangana
sandra venkata veeraiah

More Telugu News