India: స్వచ్ఛతకు పురస్కారం.. జీహెచ్ఎంసీకి ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించిన కేంద్రం!

  • ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కార్యక్రమం
  • అవార్డును అందుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్
  • అవార్డును ప్రకటించిన స్వచ్ఛ భారత్ మిషన్
హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రేటర్ హైదరాబాద్ ను సుందరంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో జాతీయ స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి ఉన్నతాధికారులు ఈ అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ కు అందజేశారు.
India
swatcha bharat

More Telugu News