Maharashtra: డ్యాన్సర్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే అసభ్య నృత్యం.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!

  • మహారాష్ట్రలోని అమ్రావతిలో ఘటన
  • ఎన్ఏడీసీ కార్యక్రమంలో బీజేపీ నేత అనిల్ చిందులు
  • తన చర్యను సమర్థించుకున్న ఎమ్మెల్యే

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డా. అనిల్ బోండే వివాదంలో చిక్కుకున్నారు. అమ్రావతి జిల్లాలో ఇటీవల నిర్వహించిన జాతీయ వ్యవసాయ అభివృద్ధి మండలి(ఎన్ఏడీసీ) కార్యక్రమంలో ఆయన ఓ డ్యాన్సర్ తో కలసి చిందులేశారు. తాను ఎమ్మెల్యేను అన్న సంగతి మర్చిపోయి అమ్మాయి వేషంలో డ్యాన్స్ చేస్తున్న యువకుడితో కలిసి అసభ్యంగా గెంతులేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే తన చర్యను బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బోండే మాత్రం సమర్థించుకున్నారు. ఇది సంప్రదాయ నృత్యం ‘దంధర్’లో భాగమని స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా ఓ పురుషుడు మహిళా వస్త్రధారణలో డ్యాన్స్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు ఎవరూ హాజరు కాలేదనీ, అలాంటప్పుడు అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు.

More Telugu News