Tollywood: దూసుకెళుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్.. 24 గంటల్లోనే 40 లక్షల వ్యూస్!

  • సంతోషం వ్యక్తం చేసిన దర్శకుడు వర్మ
  • ఆ దేవుళ్లు నిజంగా ఆశీర్వదించారని వ్యాఖ్య
  • ఎన్టీఆర్ కు ధన్యావాదాలు చెపుకుంటున్నామన్న వర్మ
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితంపై రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వర్మ నిన్న ఉదయం 9.27 గంటలకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను కేవలం 24 గంటల్లో 40 లక్షల మంది వీక్షించారు. దీనిపై వర్మ హర్షం వ్యక్తం చేశారు.

ఈరోజు వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘కేవలం 24 గంటల్లో లక్ష్మీస్ ‘ఎన్టీఆర్ ట్రైలర్’ ను 40 లక్షల మంది వీక్షించారు. ఆ దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు. ఎన్టీఆర్ కు మేమంతా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. దీనికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లింక్ ను జతచేశారు.
Tollywood
lakshmies ntr
trailers
24 hours 40 lakh hits
Twitter

More Telugu News