Chandrababu: రుణమాఫీపై రైతులకు మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు!

  • మార్చి 4లోపు నాలుగో విడత రుణమాఫీ
  • ఏప్రిల్ లోగా ఐదో విడత
  • నిధులు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశం
ఎంత భూమి ఉన్నా, రూ. 10 వేల రైతు సాయం చేయాలని నిర్ణయించిన చంద్రబాబు, మరో కానుకను ఇవ్వాలని నిర్ణయించారు. రుణమాఫీ 4వ, 5వ విడత చెల్లింపులను ఎన్నికల్లోపే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మార్చి 4లోపు నాలుగవ ఇన్ స్టాల్ మెంట్ ను, ఏప్రిల్ లో ఆఖరి ఇన్ స్టాల్ మెంట్ డబ్బులను రైతులకు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు, ఐదు విడతల్లో రుణమాఫీని పూర్తి చేయాలని భావించారు. గడచిన మూడేళ్లలో మూడు విడతల చెల్లింపులు పూర్తయ్యాయి. మరో రెండు విడతలు చెల్లించాల్సివుండగా, ఆ నిధులను వెంటనే సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Chandrababu
Loan Waver
Andhra Pradesh
Farmers

More Telugu News