Rakesh Reddy: లేడీ వాయిస్ తో జయరామ్ తో మాట్లాడింది నేను కాదు: సినీ నటుడు సూర్య ప్రసాద్

  • రాకేశ్ తో పరిచయం వాస్తవమే
  • హత్యతో సంబంధం లేదు
  • రాత్రంతా పోలీసుల విచారణలో సూర్యప్రసాద్
చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ రెడ్డితో తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమేనని సినీ నటుడు సూర్య ప్రసాద్ వ్యాఖ్యానించాడు. నిన్న రాత్రంతా సూర్య ప్రసాద్ ను విచారించిన హైదరాబాద్ పోలీసులు, తెల్లవారుజామున 4 గంటలకు అతన్ని వదిలిపెట్టారు. ఆపై మీడియాతో మాట్లాడిన సూర్య, ఈ కేసులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారని, అందులో భాగంగానే తననూ పిలిపించారని అన్నాడు.

అమ్మాయి గొంతుతో జయరామ్ తో తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశాడు. జయరామ్ హత్యకేసుతో తనకు సంబంధం లేదని, అదే విషయాన్ని పోలీసులకు చెప్పానని అన్నాడు. కాగా, జయరామ్ ను తన ఇంటికి పిలిపించేందుకు ఓ అమ్మాయి పేరిట ఆయన్ను ట్రాప్ చేసినట్టు పోలీసులు తేల్చారన్న సంగతి తెలిసిందే. అమ్మాయి గొంతుతో జయరామ్ కు ఫోన్ చేయించిన తరువాతే, ఆమెను కలవాలన్న ఆశతో వచ్చిన జయరామ్ ను నిర్బంధించి హత్య చేశారు. 
Rakesh Reddy
Surya Prasad
Jayaram
Police

More Telugu News