Police: కొత్త ట్విస్ట్... చిగురుపాటి జయరామ్ ను హత్య చేసింది రాకేష్ రెడ్డి కాదట!

  • కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులు
  • విశాల్ అనే యువకుడిపై కొత్త అనుమానాలు
  • అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో తెలంగాణ పోలీసులు మరింత లోతుగా విచారిస్తుండగా, మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జయరామ్ ముఖంపై దిండును గట్టిగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారని ఇప్పటికే తేల్చిన పోలీసులు, ఆ పని చేసింది విశాల్ అనే యువకుడని అనుమానిస్తున్నారు. రాకేశ్ రెడ్డి ట్రాప్ చేసి జయరామ్ ను తన ఇంటికి పిలిపించుకున్నాడని, అతనికి ఊపిరి ఆడకుండా చేసింది విశాల్ అంటున్న పోలీసులు, అతన్ని అరెస్ట్ చేయడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో కేసులో ప్రమేయముందన్న అనుమానంతో కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ సర్పంచ్‌ ని కూడా విచారిస్తున్నారు. ఇదే కేసులో శిఖాను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు 7 గంటల పాటు విచారించి, నిన్న రాత్రి 8 గంటలకు ఆమెను పంపించారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాకేశ్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ లను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు, కస్టడీ ముగిసేలోగా కేసులోని చిక్కుముడులన్నీ విప్పాలని భావిస్తున్నారు.
Police
Chigurupati Jayaram
Rakesh Reddy
Hyderabad
Vishal

More Telugu News