Hyderabad: హృదయవిదారకం... తండ్రి కారు కింద చితికిన రెండేళ్ల బాలుడు!

  • హైదరాబాద్ లోని మీర్ పేట్ లో ఘటన
  • కారు వెనక నిలబడ్డ బిడ్డను గుర్తించని డ్రైవర్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఓ చిన్న పొరపాటు తన బిడ్డను బలితీసుకుందని, తెలిసి చేసినా, తెలియక చేసినా ఆ పాపం తనదేనని ఓ తండ్రి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. అల్లరి చేస్తూ ఆనందాన్ని పంచే తన బిడ్డ, తన కారుకిందే నలిగిపోగా, ఏడుస్తున్న ఆ తండ్రిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. హైదరాబాద్ లోని మీర్ పేట పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..

కారు డ్రైవర్ గా పనిచేస్తున్న కృష్ణకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు గౌతమ్ వయసు 20 నెలలు. తండ్రి బయటకు వెళుతున్నాడని గమనించిన గౌతమ్, బయటకు వచ్చి కారు వెనుక నిలబడగా, దాన్ని గమనించని కృష్ణ, వాహనాన్ని రివర్స్ చేసుకుని, డ్యూటీకి వెళ్లిపోయాడు. కొడుకు ఎక్కడికి పోయాడని వెతుకుతూ బయటకు వచ్చిన భార్య జ్యోతికి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడివున్న గౌతమ్ కనిపించాడు. బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు వివరాలను నమోదు చేశారు.

More Telugu News