Rahul Gandhi: రాహుల్ ను లాగి ముద్దుపెట్టుకున్న మహిళ.. వీడియో చూడండి

  • గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ
  • రాహుల్ కు పూలమాల వేసేందుకు వేదికపైకి వచ్చిన మహిళలు
  • రాహుల్ ను ఆప్యాయంగా ముద్దాడిన ఓ మహిళ
గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు కొందరు మహిళలు వచ్చారు. తన వద్దకు వస్తున్న వారిని చూసి రాహుల్ లేచి నిల్చున్నారు. ఇంతలో ఓ మహిళ రాహుల్ ను దగ్గరకు లాగి, ఆయన బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత కూడా ఆయన గడ్డాన్ని పట్టుకుని ఆప్యాయతను కురిపించింది. ఈ సందర్భంగా, రాహుల్ కూడా నవ్వుతూ ఉండిపోయారు.

Rahul Gandhi
woman
kiss
Gujarat
congress

More Telugu News