ram gopal varma: రాహుల్, జగన్ ల ఫొటోలతో.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి ప్రమోషన్ చేస్తున్న వర్మ!

  • ట్విట్టర్ లో ఫన్నీ మెమెలు పోస్ట్ చేసిన దర్శకుడు
  • జగన్ ఇంత సీరియస్ గా ఉండటం చూడలేదని వ్యాఖ్య
  • 15 లక్షలు దాటిన సినిమా ట్రైలర్ వ్యూస్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు మధ్యాహ్నం నాటికి లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను యూట్యూబ్ లో వీక్షించిన వారి సంఖ్య ఏకంగా 15,89,177కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రతిపక్ష నేత జగన్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫొటోలతో కూడిన ఫన్నీ మెమెలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

జగన్ పాదయాత్రలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ను చూస్తున్నట్లు మెమెను పోస్ట్ చేసిన వర్మ..‘జగన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ను చూస్తున్నంత సీరియస్ గా ఇటీవలికాలంలో దేన్నీ చూడలేదు’ అని ట్వీట్ చేశారు. అలాగే రాహుల్ గాంధీ మెమెను పోస్ట్ చేసి..‘టీడీపీతో పొత్తుపై రెండో ఆలోచనలు ఉన్నాయా?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ram gopal varma
lakshmies ntr
Rahul Gandhi
Congress
Jagan
YSRCP

More Telugu News