Andhra Pradesh: చిగురుపాటి జయరాం హత్య కేసు.. పోలీసులు ముందు హాజరైన శిఖా చౌదరి!

  • హత్య కేసుపై జోరు పెంచిన పోలీసులు
  • శ్రీనివాస్, రాకేశ్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్
  • క్రైమ్ సీన్ ను రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో తెలంగాణ  పోలీసులు జోరు పెంచారు. ఇప్పటికే నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా జయరాం మేనకోడలు శిఖా చౌదరిని విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో ఆమె హైదరాబాద్ లోని ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. రాకేశ్ రెడ్డితో పరిచయం, జయరాం ఇంటికి హత్య రోజు రాత్రి ఎందుకు వెళ్లారు? అనే కోణంలో పోలీసులు శిఖా చౌదరిని విచారించనున్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి 30 మంది నిందితులను అధికారులు ఈరోజు విచారించారు. వీరిలో ప్రముఖ కమెడియన్ సూర్యప్రసాద్ అలియాస్ డుంబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు రాకేశ్ రెడ్డి కాల్ లిస్ట్ పై దృష్టి సారించిన తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో జయరాం హత్య జరిగిన రోజు రాకేశ్ రెడ్డి ఇంట్లో జరిగిన సీన్‌ను పోలీసులు రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు
Andhra Pradesh
Telangana
Police
chigurupati jayaram
sikha chowdary

More Telugu News