Lakshmis NTR: వావ్... ఎన్టీఆర్ ఆశీర్వదించేశారు... ఇక తిరుగులేదు: రామ్ గోపాల్ వర్మ

  • గంటలో 5.5 లక్షల వ్యూస్
  • ట్విట్టర్ లో వెల్లడించిన వర్మ
  • మిలియన్ వ్యూస్ దిశగా పరుగులు.
తన చిత్రాన్ని స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు ఆశీర్వదించేశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. నేడు ఉదయం తాను నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ట్రయిలర్ ను ఆయన విడుదల చేయగా, గంట వ్యవధిలో 5.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న ఆయన, "వావ్... గంటలో 5.5 లక్షల వ్యూస్. దేవుడు ఎన్టీఆర్ ఆశీర్వదించారు" అని కామెంట్ పెట్టారు. ఈ వార్త రాసే సమయానికి 6.45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ట్రయిలర్ వ్యూస్ మిలియన్ మార్క్ ను తాకడానికి మరెంతో సమయం పట్టేలా లేదు.



Lakshmis NTR
Views
you tube

More Telugu News