Chandrababu: పదవుల పందేరం... పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన చంద్రబాబు!

  • మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా శివప్రసాద్
  • మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా అనురాధ
  •  ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా మన్నే రవీంద్ర

ఎన్నికలు రానున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు పలు కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను ప్రకటించారు. మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా శివప్రసాద్ ను నియమించారు. మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా అనురాధను; అనంతపురం, కడప, కర్నూలు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా వెంకట సుబ్బారెడ్డిని; ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉప్పల జగదీశ్ బాబును; పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా సుబ్రహ్మణ్యం రెడ్డిని నియమించారు.

ఇదే సమయంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా మన్నే రవీంద్ర, తూర్పు కాపు, గాజుల కాపు కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అప్పలనాయుడు, కొప్పుల వెలమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా గండి బాబ్జి, గవర కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పీలా శ్రీనివాసరావు, చేనేత కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా సరళాదేవి, మత్స్య కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నాగేశ్వరరావు, యాదవ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్ బాలాజీలను నియమించారు.
 
వీరితో పాటు వన్యకుల క్షత్రియ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సుబ్రహ్మణ్యం, కురుమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సవిత, బట్రాజ్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా వేణుగోపాలరాజు, గాండ్ల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా విశాలాక్షి, ఈబీసీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సత్యనారాయణరాజు, గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా వీ ప్రసాద్, టైలర్స్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ గా వీవీఎల్ఎన్ స్వామిలను చంద్రబాబు నియమించారు.

  • Loading...

More Telugu News