Chandrababu: ధర్మపోరాట దీక్ష ఖర్చు పట్ల దుష్ప్రచారంపై ఏపీ మంత్రిమండలి మండిపాటు

  • ఖర్చు రూ.10 కోట్లు అంటూ దుష్ప్రచారం
  • అయిన ఖర్చు మొత్తం రూ.2.83 కోట్లు
  • మోదీ దీక్ష కంటే చాలా తక్కువన్న మంత్రివర్గం
ఏపీ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ మంత్రిమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ధర్మపోరాట దీక్ష, ప్రధాని మోదీ చేసిన విమర్శలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా దీక్ష కోసం చేసిన ఖర్చు గురించి మంత్రివర్గం వెల్లడించింది. దీక్షకు మొత్తం రూ.2.83 కోట్లు ఖర్చు అయిందని, ఇందులో రూ.1.23 కోట్లను రైళ్లకు, రూ.1.60 కోట్లను ఏపీ భవన్ వద్ద ఖర్చులకు వినియోగించినట్టు మంత్రివర్గం తెలిపింది. సెప్టెంబరు 17, 2011లో మోదీ తన స్వప్రయోజనాల కోసం ‘సద్భావన మిషన్’ పేరుతో చేసిన ఖర్చు ఇంతకంటే చాలా ఎక్కువని మంత్రి వర్గం పేర్కొంది.
Chandrababu
Amaravathi
New Delhi
Dharma porata deeksha
Narendra Modi

More Telugu News