పార్టీ మారిన వెంటనే విమర్శలు చేయటం తగదు: ఆమంచిపై శిద్దా రాఘవరావు ఫైర్
- పార్టీ వీడినందు వల్ల ఇబ్బందేమీ లేదు
- చంద్రబాబే స్వయంగా హామీ ఇచ్చారు
- పార్టీ ఎందుకు మారారో అర్థం కావట్లేదు
చంద్రబాబే స్వయంగా నేనున్నాను అని హామీ ఇచ్చినా కూడా ఆమంచి పార్టీ ఎందుకు మారారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారిన వెంటనే విమర్శలు చేయడం బాధ్యతా రాహిత్యమని మండిపడ్డారు. చీరాలలో కరణం బలరాం పోటీ చేస్తారా? లేదంటే వేరే వాళ్లు పోటీ చేస్తారా? అనేది చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. పసుపు కుంకుమ కార్యక్రమంపై విమర్శలు, డ్వాక్రా సంఘాలను ఆదుకోవడం గురించి ఆమంచి తెలుసుకోవాలని శిద్దా రాఘవరావు సూచించారు.