modi: మోదీ మళ్లీ పీఎం కావాలన్న ములాయం వ్యాఖ్యలపై రాహుల్ స్పందన

  • మోదీ ఎన్నో మంచి పనులు చేశారన్న ములాయం
  • ములాయం వ్యాఖ్యలతో ఏకీభవించనన్న రాహుల్
  • రాజకీయాల్లో ములాయం పాత్రను గౌరవిస్తానని వ్యాఖ్య
ప్రధాని మోదీ మరోసారి పీఎం కావాలని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఈరోజు లోక్ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ఎన్నో మంచి పనులు చేశారని... ఆయనను ఎవరూ వేలెత్తి చూపించలేరని ములాయం వ్యాఖ్యానించారు. ములాయం వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సాక్షాత్తు సమాజ్ వాదీ పార్టీలో కూడా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ములాయం వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆచితూచి స్పందించారు. ములాయం చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో ములాయం పోషించిన పాత్రను తాను గౌరవిస్తానని చెప్పారు.
modi
mulayam singh
rahul gandhi
sp
bjp
congress

More Telugu News