nani: తమిళంలోను రిలీజ్ కానున్న 'జెర్సీ'

  • క్రికెటర్ గా కనిపించనున్న నాని
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్
  • ఏప్రిల్లో విడుదలకి సన్నాహాలు

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'జెర్సీ' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో ఈ కథ కొనసాగనుంది. తెలుగుతోపాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా తెలుస్తోంది.

అందువల్లనే తెలుగుతో పాటు తమిళ పాటలను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా నుంచి రేపు ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే అదే పాటను తమిళంలోను విడుదల చేస్తారట. తమిళంలో ఈ పాటను దర్శకుడు విఘ్నేశ్ శివన్ రాసినట్టుగా తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీన గానీ .. 12వ తేదీన గాని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

More Telugu News