నెల్లూరులో లారీడు స్మార్ట్ ఫోన్ల దొంగతనం!

  • కంటెయినర్ లో స్మార్ట్ ఫోన్లు
  • డ్రైవర్ ను కొట్టి లారీని ఎత్తుకెళ్లిన దొంగలు
  • గౌరవరం వద్ద కనిపించిన ఖాళీ కంటెయినర్

ఓ కంటెయినర్ నిండా స్మార్ట్ ఫోన్లతో వస్తున్న లారీని దొంగలు ఎత్తుకుపోయిన ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. దగదర్తి సమీపంలో లారీని అడ్డగించిన కొందరు దుండగులు, డ్రైవర్ ను కొట్టి, దాన్ని దర్జాగా తీసుకెళ్లిపోయారు. కంటెయినర్ నిండా మొబైల్ ఫోన్లు ఉన్నాయని, వీటి విలువ రూ. 4 కోట్లకు పైగానే ఉంటుందని డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. కంటెయినర్ ను తీసుకెళ్లిన దొంగలు, దానిలోని ఫోన్లన్నీ వేరే వాహనంలో తరలించి, ఖాళీ లారీని గౌరవరం వద్ద వదిలి వెళ్లారు. నెల్లూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లోని అన్ని పోలీసు స్టేషన్లనూ అలర్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News