Fermington: సరైన పత్రాలతో మళ్లీ రావచ్చంటూ... 8 మంది తెలుగు విద్యార్థులకు అమెరికా విముక్తి!

  • నకిలీ వర్శిటీ ఉచ్చులో ఎంతో మంది విద్యార్థులు
  • స్వచ్ఛందంగా దేశం విడిచి వెళతామని వినతి
  • అంగీకరించిన న్యాయస్థానం

అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు, ఎఫ్బీఐ కలిసి ఏర్పాటు చేసిన నకిలీ యూనివర్శిటీ ఫర్మింగ్టన్ ఉచ్చులో పడి, తాము తప్పు చేస్తున్నామని తెలిసి కూడా అమెరికాకు వెళ్లి అరెస్ట్ అయి ఇబ్బందులు పడ్డ 8 మంది తెలుగు విద్యార్థులకు ఊరట లభించింది. వీరి కేసు కోర్టుకు రావడంతో వారంతా తాము స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయమూర్తికి చెప్పడంతో, వారు తిరిగి ఇండియా వెళ్లేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

 అంతకుముందు ఈ కేసులో న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, మరోసారి అమెరికా రావాలని భావిస్తే, సరైన వీసా పత్రాలతో దర్జాగా రావచ్చని ఆయన తెలిపారు. కాగా, తమను జైలు నుంచి విడిపించేందుకు సహకరించిన తెలుగు సంఘాల ప్రతినిధులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఇంకా 30 మంది వరకూ జైళ్లలో ఉండగా, మరో 50 మందికి పైగా జియో ట్యాగ్ అరెస్ట్ లతో బయట తిరుగుతున్నారు.

More Telugu News