TV: టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్.. చానళ్ల ఎంపిక గడువు పొడిగింపు

  • జనవరి 31తో ముగిసిన గడువు
  • మరో రెండు నెలలు పొడిగించిన ట్రాయ్
  • అవగాహన కల్పించడంలో కేబుల్ ఆపరేటర్లు విఫలం

టీవీ వీక్షకులకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ  ట్రాయ్ శుభవార్త చెప్పింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం చానళ్లు ఎంచుకునే గడువును మార్చి 31 వరకు పొడిగించింది. నిజానికి ఈ గడువు గత నెల 31తో ముగిసింది. అయితే, చానళ్లు ఎంపిక చేసుకోవడంలో వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గడువును పొడిగించింది. వినియోగదారులకు స్థానిక కేబుల్ ఆపరేటర్లు అవగాహన కల్పించడంలో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు ట్రాయ్ పేర్కొంది.

ట్రాయ్ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ సర్వీసులు 6.7 కోట్ల డీటీహెచ్ సర్వీసులు ఉన్నాయి. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద వినియోగదారులు తమకు నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు ట్రాయ్ పేర్కొంది. పొడిగించిన గడువులోగా బెస్ట్ ఫిట్‌ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. కాగా,  ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తాము చూసే చానళ్లకు మాత్రమే ధర చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News