Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు.. కేజ్రీవాల్ దీక్షకు మద్దతు

  • రాష్ట్ర సమస్యలపై కేజ్రీవాల్ దీక్ష
  • సంఘీభావం తెలపనున్న చంద్రబాబు
  • ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా
ఢిల్లీ రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు చేపట్టనున్న దీక్షకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలపనున్నారు. ఇందుకు కోసం నేటి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న బాబు ముఖ్యమైన కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకున్నారు.

నేటి సాయంత్రం జరగాల్సిన  మంత్రివర్గ సమావేశాన్ని ఉదయానికి మార్చారు. అలాగే, విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి నేడు చంద్రబాబు శంకుస్థాపన చేయాల్సి ఉండగా, దానిని కూడా గురువారానికి మార్చారు.
Chandrababu
Arvind Kejriwal
New Delhi
Andhra Pradesh
Bhogapuram airport

More Telugu News