Narendra Modi: ఈ నెల 15న పట్టాలెక్కనున్న 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్ రైలు.. టిక్కెట్ ధరలు ఖరారు!

  • గంటకు 180 కి.మీ. వేగం
  • మొదట్లో ‘ట్రైన్‌18’గా పిలిచేవారు 
  • మోదీ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోప్రారంభించారు

భారత తొలి ఇంజిన్ రహిత రైలు అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్ ధరలు ఖరారయ్యాయి. పూర్తి స్వదేశీ  పరిజ్ఞానంతో తయారైన ఈ రైలును ‘ట్రైన్‌18’గా పిలిచారు. ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. దీనిలో 16 బోగీలుంటాయి. ఈ రైలు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్‌లో ఎగ్జిక్యూటివ్, చైర్ కార్ అనే రెండు తరగతుల టిక్కెట్లను ప్రయాణికులు పొందవచ్చు. ఢిల్లీ - వారణాసి మధ్య రాకపోకలు సాగించనున్న ఈ ట్రైన్ ఫిబ్రవరి 15 నుంచి పట్టాలెక్కనుంది.

 ఏసీ చైర్ కార్ టిక్కెట్ ధర రూ.1850 కాగా.. ఎగ్జిక్యూటివ్ తరగతి టికెట్ ధర రూ.3250 అని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్ టిక్కెట్లను రూ.1,795, రూ.3,470కి పొందవచ్చు. ఎగ్జిక్యూటివ్ తరగతిలో ఢిల్లీ నుంచి వారణాసికి ప్రయాణించే వారికి టీ, అల్పాహారం, భోజనానికి రూ.399, చైర్ కార్ టికెట్‌పై ప్రయాణించే వారు రూ.344 చెల్లించాలి. వారణాసి - ఢిల్లీకి ప్రయాణించే ఎగ్జిక్యూటివ్‌, చైర్‌ కార్‌ తరగతి వారు రూ.349, రూ.288 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రయాణించే శతాబ్ది రైళ్ల కన్నా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ చైర్‌ కార్‌ ధర 1.5 రెట్లు, ఎగ్జిక్యూటివ్‌ తరగతి టిక్కెట్‌ ధర 1.4 రెట్లు అధికంగా ఉంది.  

More Telugu News