NDA: మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుంది..మోదీయే మళ్లీ ప్రధాని: ప్రశాంత్ కిషోర్

  • నితీశ్ కుమార్ ఎన్డీఏలో ఒక పెద్ద నేత
  • అయినా ఆయన అభ్యర్థిత్వం సాధ్యపడకపోవచ్చు
  • ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయన్ని ఊహించుకోలేం
జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకొస్తుందని, మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపడతారని అభిప్రాయపడ్డారు. నితీశ్ కుమార్ ఎన్డీఏలో ఒక పెద్ద నేత, బీహార్ ని పదిహేనేళ్ల పాటు పాలించిన ఘనత ఉన్న నాయకుడు ఆయన అని, అయితే, ప్రధాని స్థానంలో ఇప్పుడే ఆయన్ని ఊహించుకోలేమని వ్యాఖ్యానించారు. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినా, నితీశ్ అభ్యర్థిత్వం సాధ్యపడకపోవచ్చని అన్నారు.
NDA
BJP
Modi
JDU
prasanth kishore

More Telugu News