Chandrababu: 18 డిమాండ్లతో కూడిన లేఖను రాష్ట్రపతికి అందించిన చంద్రబాబు

  • కోవింద్ ను కలిసిన చంద్రబాబు, 11 మంది బృందం
  • ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని విన్నపం
  • మోదీకి నాయకత్వ లక్షణాలు లేవన్న చంద్రబాబు

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, 11 మందితో కూడిన బృందం కలిసింది. ఈ సందర్భంగా 18 డిమాండ్లతో కూడిన లేఖను కోవింద్ కు చంద్రబాబు అందజేశారు. వీరంతా ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లారు.

రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోవింద్ ను కోరామని చెప్పారు. విభజన హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో మోదీ చెప్పిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రధాని మోదీకి నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మోదీకి లేదని అన్నారు. ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తానికి తెలియజేశామని చెప్పారు.

More Telugu News