New Delhi: పెళ్లి విందు రుచిగా లేదట... చావగొట్టారు!

  • న్యూఢిల్లీలో ఘటన
  • ఓ హోటల్ లో వివాహ వేడుక
  • భోజనం సరిగ్గా లేదంటూ నానాయాగీ
పశ్చిమ ఢిల్లీ పరిధిలోని జనక్ పురి ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లిలో తమకు వడ్డించిన విందు రుచిగా లేదంటూ, హోటల్ స్టాఫ్ ను పెళ్లికి వచ్చిన అతిథులు చావగొట్టారు. ఆపై హోటల్ లో లక్షల రూపాయల విలువైన సామగ్రిని పగులకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మగపెళ్లివారు, ఆడపెళ్లివారు కొట్టకుంటున్న దృశ్యాలు, ఆపై హోటల్ స్టాఫ్ ను అందరూ కలిసి కొడుతున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఓ హోటల్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి దాదాపు 500 మందికి పైగా అతిథులు వచ్చారు. వారందరికీ విందు భోజనం వడ్డించే కాంట్రాక్టును హోటల్ కే అప్పగించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.

New Delhi
Marriage
Janakpuri
Dinner
Taste

More Telugu News