vijayalalitha: విజయశాంతి మా అక్కయ్య కూతురు .. ఆ సినిమాతో పరిచయం చేశాను: సీనియర్ నటి విజయలలిత

  • తొలి సినిమా 'భీమాంజనేయ యుద్ధం
  • 'రంభ' పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది
  •  నిర్మాతగా తొలి సినిమా 'దేవుడు మావయ్య'       

తెలుగు తెరపై విజయలలిత లేడీ జేమ్స్ బాండ్ అనిపించుకున్నారు. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం .. అందువలన 'భీమాంజనేయ యుద్ధం' సినిమాలో 'రంభ' పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. తెలుగులో నా మొదటి సినిమా అదే. డాన్స్ పరంగా ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇక నిర్మాతగా నా మొదటి సినిమా 'దేవుడు మావయ్య'. ఈ సినిమా నాకు నష్టాలనే తీసుకొచ్చింది. ఆ తరువాత 'ఆడదాని సవాల్' సినిమాను నిర్మించాను. ఈ సినిమా ద్వారానే విజయశాంతిని పరిచయం చేశాను. తాను మా అక్కయ్య కూతురు. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేయవలసిన బాధ్యత నాపై వుంది కనుక అలా చేశాను. తను స్టార్ హీరోయిన్ అయిన తరువాత గర్వపడ్డాను'' అని చెప్పారు.

  • Loading...

More Telugu News