Rafele jets: ‘రాఫెల్’ ఒప్పందంలో ‘ఉల్లంఘన’.. ద హిందూ పత్రిక కథనంతో ప్రకంపనలు

  • రాఫెల్ ఒప్పందంపై తొలి నుంచీ అనుమానాలు
  • అవినీతిపై పోరాటం చేస్తున్నట్టు చెబుతున్న ప్రభుత్వమే ఇలా.. 
  • కీలకమైన ఎస్క్రో ఖాతా నిర్వహణను ఎగరగొట్టేశారంటూ కథనం

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కీలక షరతులను ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ జాతీయ పత్రిక ‘ద హిందూ’ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. రక్షణ ఒప్పందాల్లో అవినీతిపై పోరాటం చేస్తున్నట్టు పదేపదే చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం.. అవినీతి చర్యలకు జరిమానా, చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా నిర్వహణ వంటి కీలక షరతులను ఒప్పందం నుంచి తొలగించిందంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్-ఫ్రాన్స్ మధ్య 2016లో  ఒప్పందం ఖరారు కావడానికి ముందే ఈ ‘ఉల్లంఘన’ జరిగిందని పేర్కొంది.

భారత్-ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదరగా దసో ఏవియేషన్ సరఫరాదారుగా ఉండనుంది. అయితే, ప్యాకేజీ బాధ్యతలను మాత్రం ఎంబీడీఏ ఫ్రాన్స్ నిర్వహిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ రెండూ ప్రైవేటు సంస్థలే. అయితే,  దసో-ఎంబీడీఏలతో కుదిరిన సరఫరా ప్రోటోకాల్స్ నుంచి కీలకమైన నిబంధనను ఎగరగొట్టేశారని పత్రిక తన కథనంలో పేర్కొంది.

అత్యున్నత రాజకీయ జోక్యం వల్లే ఇది సాధ్యమైందని, చివరి నిమిషంలోనే ఈ మార్పు జరిగిందని వివరించింది. ఎస్క్రో ఖాతా లేకపోవడం వల్ల భారత వైమానిక దళానికి ఒరిగేదేమిటని ప్రశ్నించింది. కీలకమైన నిబంధనను ఉల్లంఘించి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన భారత చర్చల బృందంలోని ముగ్గురు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదని పేర్కొంది.

More Telugu News