Sujana Chowdary: కేంద్రం, రాష్ట్రం మధ్య పంచాయితీ పొలం గట్టు సమస్య కాదు: సుజనా చౌదరి

  • ధర్మ పోరాట దీక్ష సక్సెస్
  • దీక్షకు సంఘీభావం తెలపటంలో ప్రత్యేకతేమీ లేదు
  • అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయి
కేంద్రం, రాష్ట్రం మధ్య పంచాయితీ పొలం గట్టు సమస్య కాదని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష సక్సెస్ అయిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎక్కువమంది దీక్షకు సంఘీభావం తెలపటంలో ప్రత్యేకత ఏమీ లేదని.. ఏపీ డిమాండ్ పట్ల అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ దీక్షతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని కాదు కానీ.. బలం ఉంది కదా అని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కకూడదన్నారు.
Sujana Chowdary
Telugudesam
Chandrababu
Congress
Special Status

More Telugu News