వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు.. ‘అనుష్క ఈజ్ బ్యాక్’ అంటున్న నెటిజన్లు
- ‘భాగమతి’ తరువాత సినిమాలకు దూరం
- లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన సుందర్ రాము
- గతంలో కంటే నాజూకుగా కనిపిస్తున్న అనుష్క
తాజాగా ఆమె లేటెస్ట్ ఫొటోలను ఫొటోగ్రాఫర్ సుందర్ రాము సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను నెటిజన్లు షేర్ చేయడమే కాకుండా.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుపు రంగు దుస్తుల్లో సముద్రం ఒడ్డున కూర్చుని ఫొటోలు తీయించుకుంది. వీటిలో అనుష్క గతంలో కంటే నాజూకుగా కనిపించడంతో ‘అనుష్క ఈజ్ బ్యాక్’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.