Andhra Pradesh: టీడీపీ నేతల ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు.. దుమ్మెత్తి పోసిన విజయసాయిరెడ్డి!

  • టీడీపీ-బీజేపీది ప్రైవేటు ప్రేమాయణం
  • అనైతిక సంబంధానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
  • ట్విట్టర్ లో మండిపడ్డ వైసీపీ సీనియర్ నేత
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు టీడీపీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు బహిరంగంగా దుమ్మెత్తి పోసుకుంటూ, ప్రైవేటుగా ప్రేమాయణం సాగిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పార్లమెంటు సభ్యుడు హరిబాబు టీడీపీ నేతలతో కలిసి కూర్చుని ఢిల్లీకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రైవేట్‌గా ప్రేమాయణం కొసాగిస్తున్నారు. బీజేపీతో కటీఫ్‌ అంటూనే బాబు &కో చాటుగా వారితో సాగిస్తున్న కాపురం గుట్టు రట్టయింది.

ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన స్పెషల్‌ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు! అనైతిక సంబంధానికి ఇంకేం నిదర్శనం కావాలి?’ అని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా తన ట్వీట్ కు విజయసాయిరెడ్డి జత చేశారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
BJP
haribabu
MPS
Twitter
pic

More Telugu News