Andhra Pradesh: జనసేనలోకి తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ నాయుడు.. కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్!

  • విజయవాడ పార్టీ కార్యాలయంలో జనసేన తీర్థం
  • కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పవన్
  • రాజకీయ సలహాదారు పదవి ఇచ్చిన జనసేనాని
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. మొన్నటివరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేసిన పి.రామ్మోహన్ రావు ఈరోజు తన కుటుంబంతో కలిసి జనసేనలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామ్మోహన్ రావుకు కండువా కప్పిన పవన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రామ్మోహన్ రావు గారు జనసేనలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన్ను తన రాజకీయ సలహాదారుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. రామ్మోహన్ రావుకు పబ్లిక్ పాలసీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందనీ, జయలలిత ఆసుపత్రిలో ఉండగా, రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని నడిపారని పేర్కొన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి జనసేనలో చేరినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
Andhra Pradesh
Jana Sena
Tamilnadu
Pawan Kalyan
ex CS
rammohan rao
political adviser

More Telugu News