Andhra Pradesh: చంద్రబాబు డబ్బు మూటలు పంపించబోతున్నారు!: వైఎస్ జగన్ ఆరోపణ

  • గ్రామాలకు డబ్బులు పంపబోతున్నారు
  • అన్న వస్తే పిల్లలు కలెక్టర్లు, డాక్టర్లు అవుతారని చెప్పండి
  • అనంతపురం ‘సమర శంఖారావం’లో జగన్

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు గ్రామాలకు మూటలకుమూటలు డబ్బులు పంపించబోతున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రతీ ఓటర్ చేతిలో రూ.3,000 చేతిలో కార్యక్రమాన్ని చంద్రబాబు చేయబోతున్నారని ఆరోపించారు.  

ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ‘అన్నా.. అక్కా.. అమ్మా.. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మన పిల్లలను బడికి పంపితే అమ్మ ఒడి పథకం కింద అన్న రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి’ అని సూచించారు. అనంతపురం జిల్లాలో ఈరోజు జరిగిన సమరశంఖారావం సభలో జగన్ మాట్లాడారు.

'చేయూత' పథకం ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 75 వేల రూపాయల్ని నాలుగు దఫాలుగా ఇస్తాడని చెప్పాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు. మన ప్రభుత్వం వచ్చాక పెన్షన్ ను రూ.2,000 నుంచి రూ.3,000కు పెంచుతామని అవ్వాతాతలకు చెప్పాలన్నారు. ‘అన్న ముఖ్యమంత్రి అయితే మన పిల్లలు కలెక్టర్లు అవుతారు. డాకర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు అని ప్రతీ అక్కకు, అమ్మకు చెప్పండి. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఉచితంగా వైద్యం చేయిస్తామని చెప్పండి’ అని వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

  • Loading...

More Telugu News