anantapuram: ప్రజాసంకల్ప యాత్ర తర్వాత తొలిసారి అనంతపురం వస్తున్న జగన్‌

  • జాతీయ రహదారిని ఆనుకుని నేడు సమర శంఖారావం సభ
  • హాజరుకానున్న బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లు
  • భారీ ఏర్పాట్లు చేసిన నాయకులు

ఆంధ్ర ప్రదేశ్ లో సుదీర్ఘ కాలం ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘సమర శంఖారావం’ తదుపరి సభ ఈరోజు అనంతపురంలో జరగనుంది. అనంతపురం శివారులోని హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అశోక్‌ లేల్యాండ్‌ షోరూం ఎదుట సభ జరగనుంది. ప్రజాసంకల్ప యాత్ర తర్వాత పార్టీ అధినేత తొలిసారి జిల్లాకు వస్తుండడంతో పార్టీ నాయకులు సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే తిరుపతి, కడపలో శంఖారావం సభలు పూర్తికాగా, ఈ సభలో పార్టీ అధినేత ఎటువంటి ప్రకటనలు చేస్తారో అని పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.  వై.ఎస్‌.జగన్‌ వేదికపై నుంచే కాకుండా బూత్‌ కమిటీ సభ్యుల మధ్యకు వచ్చి ప్రసంగించేలా, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వీలుగా సభా ప్రాంగణం నాలుగు వైపులా ర్యాంపులు నిర్మించారు. సభకు దాదాపు 40 వేల మంది బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

More Telugu News