Rammohan Naidu: మోదీ సభకు వైసీపీ జనాలను పంపించింది: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • ఏపీ అంటే ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం
  • మోదీ గద్దె దిగితేనే న్యాయం జరుగుతుంది
  • చంద్రబాబు దీక్షకు భయపడే వ్యక్తిగత విమర్శలు
మోదీ గద్దె దిగితేనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా గురించి మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్షకు భయపడే మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

ఏపీకి కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఏపీ అంటే ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామన్నారు. మోదీ సభకు వైసీపీ జనాలను పంపించిందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ప్రధానిగా  మోదీ ఉన్నంతకాలం విభజన హామీలు అమలు కావన్నారు.
Rammohan Naidu
Chandrababu
Andhra Pradesh
Narendra Modi
YSRCP

More Telugu News