Nani: నాని సినిమాలో స్టెప్పులేయనున్న అదా శర్మ!

  • గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జర్సీ’
  • క్రికెట్ నేపథ్యంలో రూపొందుతోంది
  • సోషల్ మీడియా ద్వారా అదా పాప్యులర్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జర్సీ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం క్రికెట్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉన్నదని సమాచారం.

దీనిలో ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫేమ్‌ అదా శర్మ స్టెప్పులేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా దర్శక, నిర్మాతలు అదాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అదా సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాప్యులర్ అవుతోంది. ఇటీవల ఈ భామ చేసిన కికీ ఛాలెంజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
Nani
Sradha Srinath
Gowtham
Anirudh
Jersy
Aada Sharma

More Telugu News