priyanka gandhi: నియోజకవర్గానికి వచ్చినప్పుడే ఆమె చీర కట్టుకుంటారు!: ప్రియాంకా గాంధీపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

  • ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రియాంక జీన్స్, టీషర్ట్ ధరిస్తారు
  • ప్రియాంక కూడా విఫల నాయకురాలే
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరీష్ ద్వివేదీ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకాగాంధీపై బీజేపీ నేత, పార్లమెంటు సభ్యుడు హరీష్ ద్వివేదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రియాంక జీన్స్ ప్యాంటు, టీషర్ట్ ధరిస్తారని... నియోజకవర్గానికి వెళ్లినప్పుడు మాత్రమే చీర కట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ విఫల నేత అయినప్పుడు ప్రియాంక కూడా విఫల నాయకురాలు అయినట్టేనని చెప్పారు.

ప్రియాంకాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఆమెను రాహుల్ నియమించారు. ఇక యూపీలోని బస్తీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా హరీష్ ద్వివేది గెలుపొందారు. రాష్ట్ర భారతీయ యువమోర్చా అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారు.

  • Loading...

More Telugu News