modi: మోదీ అడుగుపెట్టే సరికి జగన్ దాక్కున్నాడు: బొండా ఉమ

  • సొంత వాహనాల్లో మోదీ సభకు వైసీపీ కార్యకర్తలను పంపించారు
  • ఏపీకి, దేశానికి మోదీ చేసిందేమీ లేదు
  • రానున్న రోజుల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి మోదీ రావడంతో జగన్ ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు. మోదీ సభకు జనాలు రాకపోవడంతో... సొంత వాహనాల్లో వైసీపీ కార్యకర్తలను సభకు పంపించారని అన్నారు. మోదీతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

గత ఐదేళ్లలో ఏపీకి, దేశానికి మోదీ చేసిందేమీ లేదని బొండా ఉమ మండిపడ్డారు. కనీసం 20 వేల ఉద్యోగాలను కూడా కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడానికే రాష్ట్రంలో మరోసారి సభ పెట్టారని అన్నారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ 5 కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. రానున్న రోజుల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని అన్నారు.
modi
jagan
Bonda Uma
Telugudesam
bjp
ysrcp

More Telugu News