robert vadra: నిజమే నిలుస్తుంది.. నిజమే గెలుస్తుంది: రాబర్ట్ వాద్రా

  • ఎలాంటి పరిస్థితినైనా క్రమశిక్షణతో ఎదుర్కొంటా
  • అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు
  • ఈడీ విచారణ నేపథ్యంలో రాబర్ట్ వాద్రా స్పందన
మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా తొలిసారి పెదవి విప్పారు. ఎప్పటికీ నిజమే నిలుస్తుంది, నిజమే గెలుస్తుందంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు. తనకు అండగా నిలిచిన మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తాను బాగున్నానని... ఎలాంటి పరిస్థితినైనా క్రమశిక్షణతో ఎదుర్కొంటానని తెలిపారు. చివరకు నిజమే గెలుస్తుందని చెప్పారు. యూకేలో రాబర్ట్ వాద్రా పలు ఆస్తులను కలిగిఉన్నారని ఈడీ వాదిస్తోంది. మరోవైపు, ఫిబ్రవరి 16 వరకు వాద్రాను అరెస్ట్ చేయకుండా ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఈనెల 2న తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
robert vadra
congress
ed

More Telugu News