Sucide: ప్రేయసి తిట్టిందని... సెల్ఫీ వీడియో పంపి యువకుడి ఆత్మహత్య!

  • తమిళనాడు సింగనల్లూరులో ఘటన
  • బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న హరిహర సుదన్
  • ప్రేమించిన యువతి కాదన్నందుకు సూసైడ్
తన ప్రేమను ఓ యువతి కాదన్నదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ, అంతకు కొన్ని నిమిషాల ముందు సెల్ఫీ వీడియో తీసుకుని, అమ్మాయి వాట్స్ యాప్ నకు పంపిన ఘటన తమిళనాడు, కోవై జిల్లా సింగనల్లూరులో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సింగనల్లూరుకు చెందిన సత్యశీలన్‌ కుమారుడు హరిహర సుదన్‌ (19). ఈసానరి ప్రాంతంలోని ప్రైవేట్‌ పాఠశాలలో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతూ, అదే కాలేజీకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితం హరిహర సుదన్, తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగా, నిరాకరిస్తూ, ప్రేమించడం కుదరదని తిట్టి పంపింది. దీంతో శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడాలని భావించిన అతను, తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెబుతూ, ఆత్మహత్యకు కారణాలు వెల్లడిస్తూ, వీడియో తీసి పంపాడు. ఆపై ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని, విచారణ ప్రారంభించారు.
Sucide
Tamilnadu
Selfi Video

More Telugu News