Ram: నీకు సంబంధించిన ప్రతిదీ నాకు చాలా నచ్చింది: హీరో రామ్‌పై ఛార్మి ట్వీట్

  • రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’
  • రామ్‌ చాలా శ్రమించే నటుడు
  • నీ పాజిటివిటీ, ఎనర్జీ నాకు నచ్చాయి 
రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా సెట్‌లో తీసిన ఫొటోను సోషల్ మీడియాలో ఛార్మి షేర్ చేసింది.

ఆ ఫొటోలో రామ్ మాస్క్ ధరించి కనిపిస్తున్నాడు. రామ్ వ్యక్తిత్వానికి సంబంధించి ప్రతిదీ చాలా నచ్చిందని తెలిపింది. దీనికి నీ మహిళా అభిమానులు  తనను చంపకుండా ఉంటారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేసింది. ‘‘రామ్‌ చాలా శ్రమించే నటుడు. నీ పాజిటివిటీ, ఎనర్జీ నాకు నచ్చింది రామ్‌. నీకు సంబంధించిన ప్రతిదీ నాకు చాలా నచ్చింది. ఇలా మాట్లాడినందుకు నీ మహిళా అభిమానులు నన్ను చంపకుండా ఉంటారని ఆశిస్తున్నా’’ అంటూ సరదాగా పేర్కొంది.
Ram
Puri Jagannadh
Charmi
Ismart Shankar
Manisharma

More Telugu News