Hyderabad: మెట్రో లిఫ్టులో యువ జంటల ముద్దుల వ్యవహారంపై హెచ్ఎంఆర్ సీరియస్

  • షాక్ అయిన మెట్రో అధికారులు
  • సీసీ ఫుటేజీ లీకేజీపై అంతర్గత విచారణ
  • ఎల్అండ్‌టీ ఉద్యోగుల పనిగా అనుమానం

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్టులో యువ జంటలు హద్దులు దాటిన ముద్దుల వ్యవహారంపై హెచ్ఎంఆర్ సీరియస్ అయ్యింది. లిఫ్టులోని సీసీ కెమెరాల్లో రికార్డైన యువ జంటల ముద్దుల వ్యవహారమంతా బయటకు రావడంతో ఒక్కసారిగా మెట్రో అధికారులు షాక్ అయ్యారు.

సీసీ టీవీ ఫుటేజీ లీకేజీపై అంతర్గత విచారణకు ఆదేశించింది. దీనిని మెట్రో రైల్ ప్రతిష్ఠకు భంగంగా భావించిన మెట్రో అధికారులు.. ఇకపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఫుటేజి ఎలా బయటకు వచ్చిందని ఆరా తీసిన అధికారులు.. దీనిని ఎల్అండ్‌టీ హైదరాబాద్ ఉద్యోగుల పనిగా అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News