yatra: ‘యాత్ర’ సినిమా అందరి గుండెలను తాకింది.. మమ్ముట్టిలో వైఎస్సే కనిపించారు!: కొడాలి నాని

  • పాదయాత్ర ఆధారంగానే సంక్షేమ పథకాలు
  • సినిమా దర్శకుడు, యూనిట్ కు అభినందనలు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా అందరి గుండెలను తాకిందని గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని తెలిపారు. సంక్షేమ పథకాల ఆవిర్భావానికి ఈ పాదయాత్ర పెద్దపీట వేసిందన్నారు.

సినిమాలో మమ్ముట్టి గారిని చూస్తున్నంతసేపు వైఎస్ మాత్రమే కనిపించారని వ్యాఖ్యానించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి.వి.రాఘవ్, యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు నాని ట్విట్టర్ లో స్పందించారు. అంతకుముందు గుడివాడలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో కలిసి యాత్ర సినిమాను చూసిన నాని.. కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.
yatra
movie
Tollywood
biopic
padayatra
Kodali Nani
gudiwada mla
YSRCP

More Telugu News