love marriage: ఆసక్తి రేకెత్తిస్తున్న వారిద్దరి వివాహం...వయసు అంతరాన్ని చెరిపేసిన ప్రేమ బంధం

  • అతను 67 ఏళ్ల వృద్ధుడు...ఆమె 24 ఏళ్ల యువతి
  • ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి
  • రక్షణ కోసం కోర్టును ఆశ్రయించడంతో బయట ప్రపంచానికి వెల్లడి
మనసు మూగది...కానీ దానికో భాష ఉంటుంది. ఆ భాషను అర్థం చేసుకునే వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ప్రేమ చిగురించేందుకు వయసు తారతమ్యాలుండవు. రెండు హృదయాలు ఒక్కటయ్యేందుకు అర్థం చేసుకునే మనసు ముఖ్యం కానీ వయసుతో పనేముందని నిరూపించింది ఈ జంట. అతని వయసు 67 ఏళ్లు. ఆమె వయసు 24 ఏళ్లు. వయోభేదం వారి ప్రేమకు అడ్డుకాలేదు. ప్రేమించుకోవడమే కాదు పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌ రాష్ట్రం ధూరి సబ్‌ డివిజన్‌ పరిధిలోని బలియాన్‌ గ్రామానికి చెందిన షంషేర్‌ (67), నవ్‌ప్రీత్‌ కౌర్‌ (24)లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు కుటుంబాల పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించ లేదు. దీంతో చండీగఢ్‌లోని గురుద్వారాలో జనవరిలో తమ మనసుకు నచ్చినట్లు వివాహం చేసుకున్నారు. చిలకా గోరింకల్లా సాగిపోతున్నారు.

కాకపోతే పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందున వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారు. అందుకే తమకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ విచారించిన కోర్టు ఇద్దరూ మేజర్లు అయినందున ఇష్టప్రకారం పెళ్లి చేసుకుని జీవించే హక్కుందని, కావున నూతన జంటకు రక్షణ కల్పించాలని సంగ్రూర్‌, బర్నాలా జిల్లా ఎస్పీలను ఈనెల 4వ తేదీన ఆదేశించింది.

దీనిపై సంగ్రూర్‌ ఎస్పీ సందీప్‌ గార్గ్‌ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని స్పష్టం చేశారు. కాగా, వయసు రీత్యా భారీ తేడా వున్న వీరి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
love marriage
punjab
highcourt

More Telugu News