Naga Jhansi: ఆత్మహత్యకు ముందు ప్రియుడు సూర్యతో పదేపదే ఫోన్లో మాట్లాడిన టీవీ నటి ఝాన్సీ

  • ఆత్మహత్యకు ముందు మూడుసార్లు ఫోన్ సంభాషణ
  • కాల్ డేటాను సేకరించిన పోలీసులు
  • సూర్యతేజ-ఝాన్సీ మధ్య ప్రేమ ఉన్నట్టు పోలీసుల నిర్ధారణ
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు టీవీ నటి నాగఝాన్సీ అంతకుముందు ప్రియుడు సూర్య తేజతో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఉదయం ఆరు గంటలకు, పది గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు అతడితో మాట్లాడిందని, మొత్తంగా పది నిమిషాలు అతడితో ఫోన్లో సంభాషించినట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

ఈ సంభాషణ ఆధారంగా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగినట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆమె వాడిన ఫోన్లలో శాంసంగ్ ఫోన్ లాక్ తెరిచిన పోలీసులు, ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, శాంసంగ్ ఫోన్లో ఆమె ఆత్మహత్యకు ముందు తీసుకున్నట్టుగా చెబుతున్న వీడియో లేదని తెలుస్తోంది. ఐఫోన్‌ను అన్‌లాక్ చేస్తే ఏమైనా సమాచారం లభిస్తుందేమోనని భావిస్తున్నారు.

మరోవైపు, అంత్యక్రియల కోసం స్వగ్రామానికి వెళ్లిన ఝాన్సీ కుటుంబ సభ్యులను విచారణ కోసం నగరానికి రావాలని పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. వారిచ్చే సమాచారం ఆధారంగా సూర్య తేజను విచారించాలని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Naga Jhansi
TV Actress
Surya teja
Suicide
Hyderabad
Police

More Telugu News