Jagan: మోసగాడైన జగన్‌కు సపోర్ట్ చేస్తే దేవుడి శాపం తగులుతుంది: కేఏ పాల్

  • తిరుపతి వెంకన్నకు పూజలు చేసిన వ్యక్తికి అసలు ఓటేయొచ్చా?
  • జగన్ ఏ మతస్థుడు అన్నందుకు గతంలో దాడిచేశారు
  •  చంద్రబాబు ఉచిత వరాలపై హైకోర్టుకు వెళ్తా
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జోరు పెంచిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పాల్.. మోసగాడైన జగన్‌కు ఓటేస్తే పాపం చుట్టుకుంటుందని, దేవుడి శాపం తగులుతుందని హెచ్చరించారు. తిరుపతి వేంకటేశునికి పూజలు చేసిన జగన్‌కు అసలు ఓటు వేయవచ్చా? అని ప్రశ్నించారు.

జగన్ హిందువుడా? క్రిస్టియనా? మహమ్మదీయుడా? అని ప్రశ్నించిన పాస్టర్‌పై గతంలో దాడులు చేశారని పాల్ గుర్తు చేశారు. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.12 వేల కోట్ల ఉచిత హామీలు ప్రకటించడంపై కోర్టుకు వెళ్తామన్నారు.
Jagan
YSRCP
KA Paul
Prajashanthi
Chandrababu
Telugudesam

More Telugu News