Rafel: ‘రాఫెల్’ అంశంపై ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారు: రాహుల్ గాంధీ

  • ఫ్రాన్స్ తో పీఎంఓ నేరుగా చర్చలు జరిపింది
  • అంబానీకి రాఫెల్ ఒప్పందం లభించాలని మోదీ చెప్పారు
  • కాపలాదారుడే దొంగ అయ్యారు

‘రాఫెల్’ అంశంపై ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మీడియాతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాఫెల్ ఒప్పందం విషయంలో రక్షణశాఖ నిర్ణయాలకు భిన్నంగా  
ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ప్రవర్తించిందని, ఫ్రాన్స్ తో సమాంతర సంప్రదింపులు జరిపినట్టు తేలిందని అన్నారు. ఈ కుంభకోణంలో మోదీ ప్రత్యక్ష పాత్ర పోషించారని ఏడాదిగా తాము చెబుతూనే ఉన్నామని అన్నారు.

భారత ప్రధానమంత్రి తమ సంప్రదింపుల బృందంతో సంతృప్తికరంగా లేకపోతే తన సంప్రదింపుల బృందంతో ఫ్రాన్స్ తో ప్రత్యక్షంగా మంతనాలు జరపవచ్చని రక్షణ శాఖ పేర్కొందని చెప్పారు. అనిల్ అంబానీకి రాఫెల్ ఒప్పందం లభించాలని ప్రధాని మోదీ తనకు చెప్పినట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలండ్ వెల్లడించారని, అది నిజమని ఇప్పుడు నిరూపితమైందని, కాపలాదారుడే దొంగ అయ్యారంటూ మోదీపై ఆరోపణలు చేశారు.

More Telugu News