Uttam Kumar Reddy: కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10 నుంచి దరఖాస్తు చేసుకోండి: ఉత్తమ్
- పార్లమెంట్ ఎన్నికలలో పోటీకి ఆహ్వానం
- గాంధీభవన్‌లో దరఖాస్తులు అందజేయాలి
- తుది నిర్ణయం హై కమాండ్‌దే
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10 నుంచి పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు నేడు ఆయన ఒక ప్రకటన చేశారు.
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12 వరకూ పూర్తి బయోడేటాను గాంధీభవన్‌లో అందజేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తనకు అందిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసి ఏఐసీసీకి నివేదిస్తుందని.. తుది నిర్ణయం మాత్రం హై కమాండ్‌దేనని ఉత్తమ్ తెలిపారు.