tejashwi yadav: తేజస్వి యాదవ్ కు చుక్కెదురు.. జరిమానా విధించిన సుప్రీంకోర్టు

  • ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమనడంపై తేజస్వి పిటిషన్
  • పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ. 50వేల జరిమానా

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమనడంపై సుప్రీంకోర్టులో తేజస్వి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ విచారించారు. పిటిషన్ ను కొట్టివేసిన ఆయన... తేజస్వికి తలంటారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు బంగ్లాను కేటాయించారని... పదవి లేనప్పుడు బంగ్లాను ఖాళీ చేయాల్సిందే కదా? అని ప్రశ్నించారు. ప్రాధాన్యత లేని పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ. 50వేల జరిమానాను కూడా విధించారు.

More Telugu News