jagan: జగన్ ను నమ్మం.. ఆయన తీరుతో వైయస్ ఆత్మ ఘోషిస్తుంటుంది: రఘువీరా

  • జగన్ మద్దతిచ్చినా తీసుకోము
  • కాంగ్రెస్ కండువా కప్పుకునే వైయస్ కు వైసీపీ కండువా కప్పుతున్నారు
  • కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
ప్రత్యేక హోదాపై ఎవరు సంతకం చేస్తే, వారికి వైసీపీ మద్దతిస్తుందన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. జగన్ ను నమ్మే పరిస్థితుల్లో తాము లేమని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ అలాంటి పరిస్థితి వచ్చినా... జగన్ మద్దతు తీసుకోబోమని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు 200 లోక్ సభ సీట్లు వస్తాయని... కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నా... జగన్ వారినే పట్టుకుని వేలాడుతున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్... కాంగ్రెస్ కండువా ధరించే తన తండ్రికి వైసీపీ కండువా కప్పుతున్నారని... ఇది చూసి వైయస్ ఆత్మ ఘోషిస్తూ ఉంటుందని అన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి ప్రత్యేక హోదా భరోసా యాత్రను ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు.
jagan
raghuveera
congress
ysrcp
modi
amit shah
bjp
special status

More Telugu News